: తెలుగు తెరపై కొత్త వెంకన్న... దర్శకేంద్రుడి చిత్రంలో సౌరభ్ రాజ్ జైన్!

సౌరభ్ రాజ్ జైన్... ఈ పేరంటే తెలుగు సినీ ప్రేక్షకులకు అసలు పరిచయం లేదు. కానీ, ఎన్నో హిందీ సీరియల్స్ లో విష్ణువు, కృష్ణుడు, రాముడి పాత్రలను షోషించి, వాటి తెలుగు డబ్బింగ్ వర్షన్ల రూపంలో తెలుగింట ఆరాధ్యుడిగా మారాడు. ఇక అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి చిత్రాలను నాగార్జునతో తీసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తాజాగా, శ్రీవెంకటేశ్వర స్వామితో పాచికలాడిన హాథీరాం బాబా జీవిత కథతో నిర్మించ తలపెట్టిన చిత్రంలో వెంకన్న పాత్రకు సౌరభ్ రాజ్ జైన్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. గత చిత్రాల్లో సుమన్ ఈ పాత్రను చేసిన సంగతి తెలిసిందే. సుమన్ కన్నా, సౌరభ్ ఆ పాత్రను మరింత రక్తి కట్టించగలడని భావించిన రాఘవేంద్రరావు ఆయన్ను సంప్రదించి ఒప్పించాడని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రకు ఉన్న ప్రాధాన్యతతో, సినీ ప్రేక్షకులను అలరించాలంటే, మంచి ముఖవర్చస్సు ఉన్న సౌరభ్ సరిగ్గా సరిపోతాడని ఆయన భావించారట. అన్నట్టు ఈ సినిమాకు 'నమో వెంకటేశాయ' అన్న పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News