: రూ. 41 వేలు దాటిన కిలో వెండి ధర

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, దేశంలోని పరిశ్రమలు, నాణాల తయారీదారులు వెండి కొనుగోళ్లకు వెల్లువెత్తడంతో కిలో వెండి ధర రూ. 41 వేలను దాటింది. బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 29,500కు చేరగా, వెండి ధర రూ. 215 పెరిగి రూ. 41,065కు చేరుకుంది. ఇటీవలి కాలంలో వెండి ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికాలో వడ్డీ రేట్లు ఇప్పట్లో మారబోవని వెలువడుతున్న అంచనాలతో, బులియన్ మార్కెట్ లావాదేవీలు ఊపందుకున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, ఇదే సమయంలో న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 0.30 శాతం పెరిగి 1,273.30 డాలర్ల వద్ద, వెండి ధర 0.29 శాతం పెరిగి 17.28 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. దేశవాళీ మార్కెట్లో ఆభరణాల బంగారం ధర రూ. 29,350 వద్ద ఉంది. గడచిన మూడు రోజుల్లో బంగారం ధర రూ. 320 పెరగడం గమనార్హం.

More Telugu News