: రాహుల్ సెంచరీ రికార్డు, రాయుడు అర్ధ సెంచరీ.. టీమిండియా ఖాతాలో తొలి వన్డే

జింబాబ్వే టూర్లో తొలి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి ద్వితీయ శ్రేణి జట్టుతో జింబ్వాబ్వేలో అడుగుపెట్టిన ధోనీ సేన తొలి వన్డేను గెలుచుకుని టైటిల్ ఫేవరేట్ అనడానికి అర్హత ఉందని నిరూపించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు జింబాబ్వేను 168 పరుగులకు కట్టడి చేసింది. 169 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆదిలోనే కరణ్ నాయర్ (7) వికెట్ కోల్పోయింది. కట్టుదిట్టమైన బంతులతో జింబాబ్వే బౌలర్లు సత్తా చాటినప్పటికీ సంయమనంతో ఆడిన కేఎల్ రాహుల్ (100), రాయుడు (62) పరుగులతో నాటౌట్ గా నిలిచి 42.3 ఓవర్లలో 173 పరుగులు సాధించి భారత జట్టుకు 9 వికెట్ల తేడాతో విజయం అందించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రాహుల్ నిలిచాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం వన్డేలోనే సెంచరీ చేసిన ఓపెనర్ గా రాహుల్ ఘనత సాధించాడు.

More Telugu News