: లవ్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులో ప్రేయసిపై యువకుడి వీరంగం... కాల్పులు జరిపిన డల్లాస్ పోలీసులు

అమెరికాలోని డల్లాస్ ఎయిర్ పోర్టులో నిన్న రాత్రి కాల్పుల మోత మోగింది. లవ్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా పేరున్న సదరు విమానాశ్రయం పార్కింగ్ లో ఉన్మాదిగా మారిన ఓ లవర్ తన ప్రేయసిపై వీరంగమాడాడు. అప్పటిదాకా బాగానే వున్నా ఆ యువకుడు ఉన్నట్టుండి సైకోగా మారాడు. ప్రేయసి కారుపై రాళ్లతో దాడి చేసిన అతడు... ఆ తర్వాత ప్రేయసిపైనా దాడికి యత్నించాడు. బ్యాగేజీ తీసుకుంటున్న సమయంలో ప్రేయసితో వాదులాటకు దిగిన అతడు నేరుగా పార్కింగ్ లో ఉన్న ఆమె కారుపై దాడి చేశాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ ప్రేయసి కేకలు వేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అప్పటికే చేతిలో రాళ్లు పట్టుకుని ఉన్మాదిలా మారిపోయిన అతడు.... రాళ్లు కిందపడేయాలన్న పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేశాడు. పోలీసులపైనా దాడికి యత్నించాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అతడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. మొత్తం 7 రౌండ్ల కాల్పుల్లో ఆ ఉన్మాద ప్రేమికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిందపడిపోయిన ఉన్మాదిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

More Telugu News