ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఐఎస్ కు మరో దెబ్బ... వైమానిక దాడుల్లో బాగ్దాదీకి గాయాలు

Sat, Jun 11, 2016, 08:48 AM
Related Image ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆ సంస్థకు నిన్న భారీ దెబ్బ తగిలింది. ఇరాక్- సిరియా సరిహద్దులో ఉగ్రవాదులను ఏరివేసేందుకు రంగంలోకి దిగిన సంకీర్ణ సేనలు చేసిన వైమానిక దాడుల్లో ఐఎస్ చీఫ్ అబూ బకర్ ఆల్ బాగ్దాదీ తీవ్రంగా గాయపడ్డాడు. ఐఎస్ ముఖ్యులతో కలిసి అతడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై సంకీర్ణ సేనలు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో బాగ్దాదీతో పాటు అతడితో కలిసి ప్రయాణిస్తున్న ఐఎస్ ముఖ్యులు కూడా గాయపడ్డట్టు సమాచారం. ఈ మేరకు అక్కడి స్థానికులతో ఈ విషయాన్ని ధ్రువీకరించగా, ఇరాకీ న్యూస్ ఛానెల్ ‘ఆల్ సుమరియా’ కూడా ఈ వార్తలు నిజమేనని తెలిపింది.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Articles (Latest)
Articles (Education)