: ఇంటర్నెట్ సెంటర్ ద్వారా అమ్మాయిలను వేధించిన యువకుడు... అరెస్టు!

హైదరాబాదులోని దిల్ షుక్ నగర్ లోని ఓ ఇంటర్నెట్ సెంటర్ ద్వారా అమ్మాయిలను వేధించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి జయేందర్ దిల్ షుక్ నగర్ లో ఓ ఇంటర్నెట్ సెంటర్ లో పార్ట్ టైమ్ జాబ్ కు కుదిరాడు. అలా కొంత కాలం ఆ ఇంటర్నెట్ సెంటర్ కు వచ్చిపోయే వారిని గమనించాడు. ఇలా వచ్చే యువతుల ఈమెయిల్, పాస్ వర్డ్ లను సేకరించాడు. ఆ తరువాత వారి మెయిల్ ఓపెన్ చేసి, వారి మెయిల్ లలో ఉండే ఫోటోలను సేవ్ చేసి పెట్టుకున్నాడు. అనంతరం ఆ ఫోటోలను మళ్లీ వారికే మెయిల్ చేసి, 'నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఇవి నీ మామూలు ఫోటోలు, అసలు ఫోటోలు పంపాలంటే నేను చెప్పినట్టు వినాలి' అంటూ వారిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో కొంత మంది యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు జయేందర్ ను పట్టుకుని అరెస్ట్ చేశారు.

More Telugu News