ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆస్కార్ నా కల... కలలు కనడం ఆపను: మంచు లక్ష్మి

Fri, Jun 10, 2016, 07:05 PM
Related Image ఆస్కార్ అవార్డు సాధించడం తన కల అని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి తెలిపింది. ఓ టీవీ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, ఆస్కార్ వస్తుందా? రాదా? అన్నది అనవసరమని, దానిని లక్ష్యంగా చేసుకుని పని చేయడమే తన పని అని ఆమె చెప్పారు. తనపై వచ్చే జోకులు, రూమర్లు చూసి నవ్వుకుంటానని చెప్పింది. తమపై వచ్చే సెటైర్లను కూడా పాజిటివ్ గా తీసుకోగలగడమే జీవితం అని ఆమె తెలిపారు. తనకు నెగిటివిటీ నచ్చదని ఆమె అన్నారు. తన చుట్టూ పాజిటివ్ గా ఉండేవారే ఉంటారని లక్ష్మి చెప్పింది. తనకు ఎవరైనా నెగిటివ్ గా కనిపిస్తే వారి నుంచి దూరంగా జరిగిపోతానని తెలిపింది. అలాంటి వారితో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Articles (Latest)
Articles (Education)