ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

12న గుంటూరులో ‘అ..ఆ’ విజయోత్సవ వేడుకలు... సందడి చేయనున్న నితిన్, సమంత

Fri, Jun 10, 2016, 03:54 PM
Related Image ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇటీవల విడుదలై, మంచి టాక్ సంపాదించుకున్న చిత్రం ‘అ..ఆ’. ఈ సందర్భంగా ఈ చిత్రం విజయోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ‘అ..ఆ’ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన గుంటూరులోని సిద్ధార్ధ గార్డెన్స్ లో సాయంత్రం ఏడు గంటలకు ఈ వేడుకలు జరగనున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షత వహించనున్నారన్నారు. ఈ చిత్రం హీరోహీరోయిన్లు నితిన్, సమంత, నరేష్, రావు రమేష్, నదియ, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొననున్నారని రాధాకృష్ణ పేర్కొన్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.150.143
Articles (Latest)
Articles (Education)