: ‘ఎగిరే కార్ల’పై గూగుల్ సహ వ్యవస్థాపకుడి ఆసక్తి... స్టార్టప్స్ లో పెట్టుబడి

సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ కు ఎప్పుడూ సరికొత్త ఆవిష్కరణలపైనే ఆసక్తి ఎక్కువ. ల్యారీ పేజ్ లోని ఆ ఆసక్తే... గూగుల్ ను ప్రపంచ దిగ్గజంగా తీర్చిదిద్దిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ల్యారీ పేజ్ మరో సరికొత్త ఆవిష్కరణకు తెర తీశారు. ఫ్లైయింగ్ కార్లను ఉత్పత్తి చేస్తామంటూ ఇప్పటికే రంగంలోకి దిగిపోయిన రెండు స్టార్టప్ సంస్థలకు ఆయన మద్దతుగా నిలిచారు. వీటిలో ఓ సంస్థలో ఆయన ఇప్పటికే 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినట్టు ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ ‘బ్లూమ్ బర్గ్’ ఆసక్తికర వార్తను ప్రచురించింది. 2010లో ఆవిర్భవించిన ‘జీ.ఏరో’ అనే సంస్థలో పేజ్ ఈ పెట్టుబడులను పెట్టారని ఆ సంస్థ తెలిపింది. ఇక గతేడాదే పుట్టుకొచ్చిన ‘కిట్టీ హాక్’ అనే సంస్థ కూడా ఫ్లైయింగ్ కార్ల ఉత్పత్తి దిశగా పరిశోధనలు ప్రారంభించిందని, ఈ సంస్థపైనా ల్యారీ ఫేజ్ ఆసక్తి చూపుతున్నారని ఆ పోర్టల్ రాసుకొచ్చింది.

More Telugu News