: బీసీసీఐకి రవిశాస్త్రి షరతు?

టీమిండియా చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసిన రవిశాస్త్రి బీసీసీఐకి ఓ షరతు విధించినట్టు తెలుస్తోంది. సాధారణంగా టీమిండియా కోచ్ గా ఎవరు పని చేయాలి, అతనికి సహాయ సిబ్బందిగా ఎవరిని పంపాలి? వంటి విషయాలన్నీ బీసీసీఐ చూసుకుంటుంది. బీసీసీఐ ఎవరిని పంపిస్తే, వారితో కోచ్ సమన్వయం చేసుకుని పని చేస్తాడు. కానీ రవిశాస్త్రి మాత్రం అలా కాకుండా తనను టీమిండియా కోచ్ గా నియమిస్తే, సహాయ సిబ్బందిని తానే ఎంచుకుంటానని షరతు విధించాడు. తనకు సహాయ సిబ్బందిగా భరత్ అరుణ్ (బౌలింగ్ కోచ్), సంజయ్ బంగర్ (బ్యాటింగ్ కోచ్), ఆర్.శ్రీధర్ (ఫీల్డింగ్ కోచ్), పాట్రిక్ ఫర్హాట్ (జట్టు ఫిజియో), శంకర్ బాసు (జట్టు ట్రైనర్), రఘు (టీమ్ అసిస్టెంట్) లను నియమించాలని ఓ జాబితా బీసీసీఐ ముందు పెట్టాడు. కాగా, కోచ్ రేసులో ఉన్న సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాద్ లు ఇలాంటి షరతులు విధించకపోవడం విశేషం.

More Telugu News