: షేవింగ్ చేసి చేసి విసిగిపోయింది... మహిళ 'గడ్డం' కథ!

అవాంఛిత రోమాలు మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. పురుషుల్లో జుట్టు రాలడం ఆందోళనకు గురి చేస్తే, స్త్రీలలో అవాంఛిత రోమాలు భయపెడతాయి. ఇలాంటి భయాన్ని గత 26 ఏళ్లుగా ఆస్ట్రేలియాకు చెందిన రోస్ గెయిల్ (39) అనే మహిళ అనుభవించింది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఆమె భయం ఒక్కటే, తెల్లారి లేవగానే తనను ఎవరూ చూడకూడదు. షేవింగ్ చేసుకున్న తరువాతే తనను చూడాలి. అయితే, ఓ రోజున పొరపాటున ఆమె తన తల్లికి అవాంఛిత రోమాలతో కనపడింది. అప్పుడు తల్లికి తన రోమాల సీక్రెట్ చెప్పేసింది. దీంతో ఆమె కుమర్తె పరిస్థితిని చూసి బాధపడి క్లినిక్ కు తీసుకెళ్లింది. కానీ, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, హార్మోన్ల లోపం వల్ల వచ్చే సమస్యకు వారు పూర్తి పరిష్కారం చూపలేకపోయారు. టాబ్లెట్లు, క్రీములు, వాక్సినేషన్ ఇలా ఎన్నో చేయించుకుంది. అయినప్పటికీ ఆమె సమస్య తీరలేదు. దీంతో షేవింగ్ చేసిచేసి విసిగిపోయి, ఎవరేమనుకుంటే అనుకోనీ అని గత రెండు నెలలుగా షేవింగ్ చేయడం మానేసింది. దీంతో విషయం ఆమె స్నేహితులు, బంధువులు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు వారంతా ఆమె గడ్డానికి ఫ్యాన్స్ అయిపోయారు. ఇంత కాలం ఏ గడ్డమైతే అందరినుంచి తనను దూరం చేసిందో, అదే గడ్డం తనలో ఆత్మవిశ్వాసం నింపుతోందని ఆమె తెలిపింది.

More Telugu News