: టీమిండియా కోచ్ పదవికి ఈ రోజే దరఖాస్తు చేశా: రవిశాస్త్రి

టీమిండియా చీఫ్ కోచ్ పదవికి ఈ రోజే దరఖాస్తు చేశానని డైరెక్టర్ రవిశాస్త్రి తెలిపాడు. ముంబైలో రవిశాస్త్రి మాట్లాడుతూ, నిర్దేశిత ఫార్మాట్ లో దరఖాస్తు పూర్తి చేసి బీసీసీఐకి అందజేశానని అన్నారు. అవసరమైన అన్ని పత్రాలు జత చేశానని, బీసీసీఐ ఇంకేమైనా అడిగితే వాటిని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నానని శాస్త్రి చెప్పాడు. పదవికి దరఖాస్తు చేయడం వరకే తన పని అని, కోచ్ గా ఎంపికవుతానా? లేదా? అన్నది బీసీసీఐ చూసుకుంటుందని శాస్త్రి తెలిపాడు. కాగా, ఈ పదవి కోసం సందీప్ పాటిల్ కూడా రేసులో ఉండడంతో బీసీసీఐ చీఫ్ కోచ్ గా ఎవరు ఎంపికవుతారన్న ఆసక్తి నెలకొంది. రవిశాస్త్రికి టీమిండియా డైరెక్టర్ గా పని చేసిన అనుభవం ఉండగా, కెన్యాలాంటి అనామక జట్టుకు కోచింగ్ ఇచ్చి, అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర సందీప్ పాటిల్ కు ఉంది. అదే సమయంలో సెలెక్టర్ గా ఉండగా, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తిగా అతనికి రికార్డు వుంది. వీరితోపాటు ఆర్.శ్రీధర్, సంజయ్ బంగర్, విక్రమ్ రాథోడ్, ప్రవీణ్ ఆమ్రే, కనిత్కర్ తదితర టీమిండియా మాజీ ఆటగాళ్లు కూడా రేసులో ఉన్నారు.

More Telugu News