: వాడు నన్ను క్షమించాడు... మంచి తండ్రివన్నాడు: బాలుడిని అడవిలో వదిలేసిన తండ్రి

తన కుమారుడు తనను క్షమించాడని, భరించరాని అల్లరి చేస్తున్నాడని చెప్పి జపాన్ అడవుల్లో వదిలేసిన ఏడేళ్ల యమతో తనూక తండ్రి తయయుకి తనూక (44) మీడియాతో చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడికి క్షమాపణలు చెప్పానని అన్నారు. జరిగిన ఘటన గురించి తన కుమారుడితో వివరంగా మాట్లాడానని అన్నారు. ఈ సందర్భంగా 'నువ్వు మంచి నాన్నవు నాన్నా' అని అన్నాడని చెప్పారు. అలాగే క్షమించానని కూడా అన్నాడని ఆయన తెలిపారు. కాగా, రోడ్డుపై వెళ్తున్న వారిపై రాళ్లు విసురుతున్నాడని, చెప్పినా వినడం లేదని బాలుడ్ని బెదిరించేందుకు అతని తల్లిదండ్రులు అడవిలో వదిలేసిన సంగతి తెలిసిందే. 200 మంది సైనికులు ఆరు రోజులపాటు సుదీర్ఘంగా జరిపిన గాలింపులో యమతో తనూక దొరికాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రేపు బాలుడ్ని డిశ్చార్జ్ చేయనున్నారు.

More Telugu News