: ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలో మ‌రోసారి భారీ భూకంపం సంభవించింది. నిన్న అర్ధ‌రాత్రి రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత‌తో ఈ భూక‌ంపం ఏర్ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. అయితే, సునామి వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌ని పేర్కొన్నారు. ఈ భూకంపం అంబాన్ ద్వీపం వద్ద 428 కిలోమీటర్ల లోతున సంభ‌వించిన‌ట్లు పేర్కొన్నారు. సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌క‌పోయినా నిన్న అర్ధ‌రాత్రి దాటాక సంభ‌వించిన ఈ భూకంపం శ‌క్తిమంత‌మైన‌దేన‌ని అధికారులు తెలిపారు. ఈ భూభాగం ఫసిపిక్ మహా సముద్రంలో ఉండ‌డంతో అక్క‌డి భూ ప‌రిస్థితుల కార‌ణంగా ప్రతి రోజు ఏదో ఒక చోట భూకంపం సంభవిస్తోంద‌ని అధికారులు వివ‌రించారు.

More Telugu News