: ‘ఉచితం’ వద్దన్న స్విస్ జనం!... ‘ఫ్రీ’ ఆఫర్ కు 'నో' చెప్పిన 78 శాతం మంది!

మన దేశంలో ‘ఉచితం’ లేనిదే ఎన్నికలు లేవు. తాయిలాలు ఇవ్వని పార్టీలకు మనోళ్లు ఓట్లేయరు. ఈ విషయాన్ని బాగా వంటబట్టించుకున్న జాతీయ పార్టీలు సహా ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికల్లో ‘ఆల్ ఫ్రీ’ అంటూ బరిలోకి దిగుతున్నాయి. ఓట్లను కొల్లగొడుతున్నాయి. ఆనక ‘ఫ్రీ’ ఆపర్లను వెల్లువెత్తిస్తున్నాయి. అయితే స్విట్జర్లాండ్ లో ప్రస్తుతం ఎన్నికలేమీ లేవు. ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం కూడా ఇప్పుడప్పుడే ముగిసే పరిస్థితి కూడా లేదు. అయితే జనం ఇబ్బంది పడకూడదన్న ఒకే ఒక్క భావనతో ఆ దేశ ప్రభుత్వం ఆఫర్ చేసిన ‘ఫ్రీ’ ని ఆ దేశ ప్రజలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ‘ఫ్రీ’ మాకెందుకు , మేం కష్టపడే సంపాదించుకుంటామంటూ ఏకంగా 78 శాతం మంది ప్రజలు తేల్చిచెప్పేశారు. వెరసి అక్కడి ప్రభుత్వానికి భారీ షాకే ఇచ్చారు. వివరాల్లోకెళితే... దేశ ప్రజలు ఇబ్బంది పడకూడదన్న భావనతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం... దేశంలోని ప్రతి పౌరుడికి నెలకు రూ.1.60 వేల మేర ఉచితంగా ఇచ్చేందుకు సరికొత్త ప్రతిపాదన చేసింది. దీనిపై దేశ ప్రజల అభిప్రాయాన్ని కోరింది. అభిప్రాయ సేకరణలో ప్రభుత్వానికి ప్రజలు దిమ్మతిరిగే తీర్పునిచ్చారు. ఉచితం అవసరం లేదని కష్టపడి పనిచేసి తమ జీనవోపాధిని సముపార్జించుకుంటామంటూ ఆ దేశ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. వెరసి స్విస్ ప్రభుత్వం ఆఫర్ చేసిన ‘ఫ్రీ’కి చెక్ పడిపోయింది.

More Telugu News