: రాజన్ తప్పుకుంటే లక్షల కోట్లు పోతాయి: స్వామినాథన్ అయ్యర్ హెచ్చరిక

ఆర్బీఐ గవర్నరుగా రఘురాం రాజన్ తప్పుకున్నా, ఆయన్ను రెండోసారి కొనసాగించరాదని మోదీ సర్కారు నిర్ణయించినా, ఇండియాలో విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటుందని, లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతాయని ఆర్థికవేత్త స్వామినాథన్ అయ్యర్ హెచ్చరించారు. ఇక అదే సమయంలో చైనాలో మాంద్యం పెరగడం, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెనక్కు వెళ్లడం వంటి వార్తలు వస్తే, భారత స్టాక్ మార్కెట్ ఘోరంగా దెబ్బతింటుందని ఆయన అన్నారు. ఇండియాలో విమర్శలను ఎదుర్కొంటున్నప్పటికీ, రాజన్ శైలిపై విదేశీ ఇన్వెస్టర్లు ఎంతో నమ్మకంతో ఉన్నారని, ఆయన భారత ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో ఎంతో సహకరించారని గుర్తు చేశారు. ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు, రేటింగ్ ఏజన్సీల నుంచి మంచి రేటింగును అందుకున్నారని అయ్యర్ తెలిపారు. ఆయన హయాంలోనే ద్రవ్యోల్బణం దిగి వచ్చిందని, తప్పుడు సంకేతాలు పంపుతున్న టోకు ధరల సూచికను, వినియోగ ధరల సూచికగా మార్చి సంస్కరణలను చేపట్టారని, వడ్డీ రేట్లు తగ్గేందుకు సహకరించారని తెలిపారు. రాజన్ ను కొనసాగిస్తేనే మేలని సూచించారు.

More Telugu News