: ట్రంప్ కు ప్రత్యర్థిని తానేనంటూ సంబరాల్లో హిల్లరీ!

యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీపడుతుండగా, ఆయనకు తానే ప్రత్యర్థినని డెమొక్రాట్ల తరఫున బరిలో దిగాలని భావిస్తున్న హిల్లరీ క్లింటన్ సంబరాలు జరుపుకుంటున్నారు. వర్జిన్ ఐలాండ్ లోని నగరాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఆరు చోట్ల హిల్లరీ, తన ప్రత్యర్థి శాండర్స్ కన్నా ముందంజలో ఉన్నట్టు వార్తలు వస్తుండటంతో ఆమెదే ఇక అభ్యర్థిత్వమని తెలుస్తోంది. దీనిపై అధికారిక పర్యటన విడుదల కానప్పటికీ, తాను గెలిచినంత ఆనందంలో హిల్లరీ ఉన్నట్టు సమాచారం. ఐలాండ్స్ లోని పెద్ద దీవులైన సెయింట్ క్రాయిక్స్ లో 92 శాతం, సెయింట్ థామస్ లో 88 శాతం ఓట్లతో ఆమె విజయం సాధించి, మరో నాలుగు చోట్ల మంచి ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఫలితాలపై స్పందించిన శాండర్స్, ఇంకా అయిపోలేదని, జూలై నెలాఖరుకు మాత్రమే డెమొక్రాట్ల తరఫున ఎవరు బరిలో ఉంటారన్న విషయం తెలుస్తుందని చెబుతున్నారు.

More Telugu News