: మారుతి సుజుకి కార్ల మైలేజీ పరీక్షల్లో అక్రమాలు... జపాన్ లో అధికారుల దాడులు

ఇండియాలో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న సంస్థ మారుతి సుజుకి, తమ కార్ల మైలేజీ పరీక్షల విషయంలో అక్రమాలకు పాల్పడిందన్న విషయం ఇండియాలో సంచలనం కలిగించగా, సంస్థ మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంపై జపాన్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రధానంగా ఇంధన పరీక్షల విషయంలో తప్పులు చేశామని, కస్టమర్లకు కార్ల మైలేజీ ఎంతన్న విషయమై అబద్ధాలు చెప్పామని సంస్థ అంగీకరించిన నేపథ్యంలో ఈ దాడులు జరుపుతున్నట్టు జపాన్ రవాణా శాఖ అధికారి ఒకరు తెలిపారు. కాగా, మైలేజీ గణాంకాలు తప్పు చెప్పినందుకు సుజుకి కార్పొరేషన్ బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. నాలుగు హైఎండ్ మోడల్స్ తో పాటు, 12 ఇతర బ్రాండ్ కార్ల విషయంలో తప్పు చేశామని సుజుకి అధికారులు ప్రకటించారు. ఇందులో ఇండియాలో విక్రయిస్తున్న కార్లు కూడా ఉన్నాయి.

More Telugu News