: విమానంలో బొమ్మను బాంబుగా పొరపడి, అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన స్వీపర్

ఒక పదాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడితే ఎంత గందరగోళం జరుగుతుందో తెలియజెప్పే సంఘటన సైప్రస్ లో చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ కు చెందిన 'ది ఏజియాన్ ఎయిర్ లైన్స్' విమానం లార్నాకా నుంచి టెల్ అవీవ్ కు వెళ్తూ, మార్గమధ్యంలో సైప్రస్ లో ఆగింది. దీనిని శుభ్రం చేసేందుకు సిబ్బంది విమానంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా విమానాన్ని క్లీన్ చేస్తుండగా స్వీపర్ కు ఓ బొమ్మ కనిపించింది. ఈ బొమ్మపై హిబ్రూ భాషలో 'బూబా' అని రాసి ఉంది. బూబా అంటే బొమ్మ అని అర్ధం, దానిని తప్పుగా చదివిన ఆమె వెంటనే అందులో బాంబు ఉందంటూ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది క్షణాల్లో బాంబ్ స్క్వాడ్ ను పంపి తనిఖీలు నిర్వహించారు. చివరకు అది బాంబు కాదు బొమ్మ అని తెలుసుకుని హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. గతంలో యూరోపియన్ దేశాల్లో బాంబుదాడులకు పాల్పడతామని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు.

More Telugu News