: హ్యాకింగ్ కు గురైన 'మై స్పేస్' అకౌంట్లు

అమెరికాలో ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ 'మై స్పేస్' హ్యాకింగ్ కు గురైంది. 2003లో ప్రారంభమైన మై స్పేస్, ఫేస్ బుక్ ప్రాభవంతో పోటీలో నిలవలేక చేతులెత్తేసింది. మై స్పేస్ కు చెందిన 3,600 లక్షల అకౌంట్లు ఆన్ లైన్ హ్యాకర్ ఫోరమ్ లో అమ్మకాలు జరిగాయని టైమ్ ఇంక్ నిర్ధారించింది. మల్టిపుల్ అకౌంట్ల కు ఒకే పాస్ వర్డ్ కలిగిన వారి అకౌంట్లు ఎక్కువగా హ్యాకింగ్ కు గురయ్యాయని మై స్పేస్ తెలిపింది. యూజర్ల పాస్ వర్డ్ లు, ఈ-మెయిల్ అడ్రస్ లను వివిధ సైట్లలో ప్రయత్నిస్తూ హ్యాకర్లు సమాచారం దొంగిలిస్తున్నారని మై స్పేస్ తెలిపింది. అయితే 2013 జూన్ 13న గట్టి సెక్యూరిటీతో మై స్పేస్ ప్లాట్ ఫాంను తయారు చేశారని టైమ్ ఇంక్ తెలిపింది. గత ఫిబ్రవరిలో టైమ్ ఇంక్ దీనిని కొనుగోలు చేసింది. సమాచార భద్రత, గోప్యత టీంలు మై స్పేస్ కు అండగా నిలుస్తాయని టైమ్ ఇంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జెఫ్ బెయిర్ట్స్ తెలిపారు.

More Telugu News