: అశోక చెట్లలో యాంటీ క్యాన్సర్ కాంపౌండ్ గుర్తింపు

అశోక చెట్లలో క్యాన్సర్ నివారణకు సంబంధించిన కొలెస్ట్రాల్ గ్లూకోజ్ అనే యాంటీ క్యాన్సర్ కాంపౌండ్ ను గుర్తించారు. ఈ విషయాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ జయభాస్కరన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో పసిఫిక్ యూ చెట్టు బెరడులో లభ్యమైన ఒక రసాయన సమ్మేళనం ప్రఖ్యాత టాక్సాల్, అశోక చెట్టు శిలీంధ్రంలో ఉండటం చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. మొక్క నుంచి వేరు చేసిన ఫంగస్ ను పులియబెట్టడానికి ముందే యాంటీ క్యాన్సర్ ఔషధ లక్షణాలను కలిగి ఉండడం విశేషమని చెప్పారు. ఈ సమ్మేళనాన్ని శుభ్రం చేసిన తర్వాత క్లినికల్, ప్రీ క్లినికల్ పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. పలు రకాల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే అనేక మొక్కలు, చెట్లలో అందుబాటులో ఉన్న ఈ ఫంగస్ పై ఎఫ్డీఏ అనుమతి పొందాల్సి ఉందన్నారు. ఈ శిలీంధ్రాన్ని ఔషధంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా, టాక్సాల్ అనే రసాయనం కలిగిన ఫంగస్ యూ చెట్ల లభ్యత తక్కువగా ఉండటంతో ప్రత్యామ్నాయాలపై పరిశోధన జరిగింది. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ జీవ శాస్త్ర విభాగం పలు రకాల ఔషధ మొక్కలపై గత దశాబ్దకాలంగా అధ్యయనాలు చేస్తోంది. ఈ క్రమంలోనే భారత్, శ్రీలంక దేశాల్లో ఎక్కువగా పెరిగే అశోక చెట్లలో యాంటీ క్యాన్సర్ కాంపౌండ్ ను గుర్తించడం జరిగింది.

More Telugu News