: ఈ ఏడాది ఐపీఎల్ హైలైట్స్ ఇవే...!

ఐపీఎల్ 2016 ముగిసింది. సుమారు నెలన్నరపాటు అభిమానులను అలరించిన ఐపీఎల్ లో ఎన్నో విశేషాలు చోటుచేసుకున్నాయి. అత్యధిక పరుగులు కోహ్లీ సాధించగా, అత్యధిక వికెట్ల్ భువనేశ్వర్ కుమార్ సాధించాడు. కాగా మరికొన్ని విశేషాలు... మొత్తం 60 మ్యాచుల్లో 17,963 పరుగులు నమోదు కాగా, 652 వికెట్లను బౌలర్లు తీశారు. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ 150.31 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. టోర్నీలో 57 డకౌట్ లు నమోదు కాగా, కోల్ కతా ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ఐదు సార్లు డకౌట్ అయ్యాడు. ఈ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పోలార్డ్, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు క్రిస్ మోరిస్ లు కేవలం 17 బంతుల్లోనే అర్ధ సెంచరీలు సాధించి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. సన్ రైజర్స్ హైదరాబాదు తరపున ఆడిన బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ 50కి పైగా ఓవర్లు బౌలింగ్ చేసి, 6.90తో బెస్ట్ ఎకానమీ రేట్ సాధించాడు. అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ గా ధోనీ నిలిచాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ వేసిన చివరి ఓవర్లో 22 పరుగులు సాధించి, ధోనీ మ్యాచ్ ను ముగించాడు. టోర్నీలో 88 బౌండరీలతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు.

More Telugu News