: 'ఇదే ఆఖరి అవకాశం, సాయపడండి' సిరియాలో మాయమైన జపాన్ జర్నలిస్టు ఆన్ లైన్లో అభ్యర్ధన!

సిరియాలో విధులు నిర్వహిస్తూ, మాయమైన జపాన్ ఫ్రీలాన్స్ జర్నలిస్టు జుంపేయ్ యసుద చిత్రం ఆన్ లైన్లో ప్రత్యక్షమైంది. తన చేతుల్లో "ప్లీజ్ హెల్ప్ మీ. దిస్ ఈజ్ ది లాస్ట్ చాన్స్" (దయచేసి సాయపడండి. ఇదే ఆఖరి అవకాశం) అని రాసివున్న పేపర్ ఉన్నట్టు వార్తా సంస్థ ఎన్.హెచ్.కే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సిరియా, ఇరాక్ లో ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల నుంచి ఆయన రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లారని తెలుస్తోంది. టోక్యోకు సమీపంలో నివాసముండే యసుద, జూన్ 2015లో సదరన్ టర్కీ ప్రాంతం నుంచి ఓ గైడ్ సాయంతో సిరియాలోకి ప్రవేశించారు. ఆపై అల్ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న నుస్రా ఫ్రంట్ గ్రూప్ కు బందీగా చిక్కినట్టు సమాచారం. కాగా, అతని విడుదలకు నుస్రా ఎటువంటి డిమాండ్లను ముందుంచిందన్న విషయం తెలియరాలేదు. ఈ నెలారంభంలో తమ వద్ద ఉన్న ముగ్గురు స్పెయిన్ జర్నలిస్టులను నుస్రా విడిచి పెట్టిన నేపథ్యంలో యసుద కూడా విడుదలవుతారన్న ఆశలు చిగురించాయి.

More Telugu News