: ఛేజింగ్ హీరో కోహ్లీ కాదు... వార్నరే!

ఛేజింగ్ లో కోహ్లీని మించిన మొనగాడు లేడనేది క్రికెట్ అభిమానుల అభిప్రాయం. కానీ గణాంకాల ప్రకారం లక్ష్య ఛేదనలో మెరుగైన ఆటగాడుగా వార్నర్ నిలిచాడు. ఐపీఎల్ లో 919 పరుగులు సాధించిన కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు పుటలకెక్కేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే అందులో అత్యధిక పరుగులు కోహ్లీ ముందుగా బ్యాటింగ్ చేసిన సందర్భంగా చేసినవే ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. 2016లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు. వార్నర్ ఈ సీజన్ లో ఛేజింగ్ లో 468 పరుగులు చేయగా, అతని తరువాతి స్థానంలో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప (457 పరుగులతో) నిలిచాడు. ఫైనల్ లో కూడా వార్నర్ లక్ష్య ఛేదన మొదలు పెడితే ఈ రికార్డు మెరుగుపడనుంది.

More Telugu News