: ఇన్నేళ్లకు బయటపడ్డ అమెరికా బాంబర్ విమానం!

రెండో ప్రపంచయుద్ధం కాలంలో శత్రు సైన్యాలు మట్టుపెట్టిన అమెరికా బాంబర్ విమానం టీబీఎం-1సీ అవెంజర్ విమానం ఆచూకీ సుమారు 72 ఏళ్ల తర్వాత లభ్యమైంది. పసిఫిక్ మహా సముద్రం మీదుగా ముగ్గురు సిబ్బందితో అమెరికా బాంబర్ విమానం వెళ్తుండగా శత్రు సైన్యాలు దాన్ని గుర్తించి నాడు పేల్చేశాయి. దాంతో ఆ విమానం సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ బాంబర్ విమానంలో ముగ్గురు సిబ్బంది అవశేషాలు కూడా కనిపించాయి. ఈ విషయాన్ని ప్రాజెక్టు రికవర్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎరిక్ టెరిల్ మాట్లాడుతూ, పలు సందర్భాల్లో అదృశ్యమైపోయిన విమానాల ఆచూకీని తెలుసుకునేందుకు అమెరికా ‘ప్రాజెక్ట్ రికవర్’ ను చేపట్టిందన్నారు. అత్యాధునిక సోలార్ టెక్నాలజీని ఉపయోగించి అదృశ్యమైపోయిన విమానాల ఆచూకీ గుర్తిస్తామన్నారు. పలు సంఘటనల్లో కనిపించకుండా పోయిన సిబ్బంది మృతదేహాల శరీర భాగాలను గుర్తించి, వాటిని అమెరికాకు తీసుకువచ్చి వారికి అంత్యక్రియలు నిర్వహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

More Telugu News