: రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ ఖరారు!... స్పష్టమైన మెజారిటీ సాధించిన రియల్ ఎస్టేట్ టైకూన్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఇప్పటిదాకా జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను సాధించిన ఆయన పార్టీ టికెట్ చేజిక్కించుకునేందుకు అవసరమైన డెలిగేట్ల మద్దతు కూడా సంపాదించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసే నేతకు 1,237 మంది డెలిగేట్ల మద్దతు అవసరముండగా, ట్రంప్ కు ఇప్పటికే 1,238 మంది డెలిగేట్ల మద్దతు లభించిందని ‘అసోసియేటెడ్ ప్రెస్’ వార్తా సంస్థ తెలిపింది. వచ్చే నెలలో జరగనున్న నేషనల్ కన్వెన్షన్ లో ఆయన రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలోకి దిగే టికెట్ ను అందుకోనున్నారు.

More Telugu News