: మీ చూపుడు వేలు, ఉంగరం వేలిని బట్టి మీరెలాంటి వారో చెప్పవచ్చు

వ్యక్తిత్వం తెలుసుకునేందుకు నిపుణులు రకరకాల విశ్లేషణలు చేస్తుండడం వింటుంటాం. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు వ్యక్తిత్వాన్ని విశ్లేషించడం సర్వసాధారణం. మీ చేతి వేళ్లను బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. చేతి వేళ్లలో ఉంగరం వేలు, చూపుడు వేలిని బట్టి మీరు ఎలా వ్యవహరించవచ్చంటే....మీ చూపుడు వేలు ఉంగరం వేలు కంటే పెద్దదిగా (పొడవుగా) ఉంటే మీరు అతి విశ్వాసంతో ఉంటారు. అది ఎదుటి వారికి అహంకారంలా కనిపిస్తుంది. వీరు అంతర్ముఖులు కాకపోవచ్చుకానీ, తమతో తాము గడపడాన్ని వీరు ఎక్కువ ఆస్వాదిస్తారు. వీరు లక్ష్యం దిశగా ఎప్పుడూ ఆలోచిస్తారు. వీరు ప్రేమను వ్యక్తీకరించలేనట్టే స్నేహ హస్తాన్ని కూడా చాచలేరు. ఇలాంటివారికి ఎదుటి వారి నుంచి ఎంత దక్కితే అంతటితోనే సర్దుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే చూపుడు వేలు కంటే ఉంగరం వేలు పెద్దదైతే...చూడ్డానికి బాగుండడంతో పాటు మంచి మాటకారులు. ఇతరులకు సాయం చేసేందుకు ముందుంటారు. వీరు ప్రియుడు, ప్రియురాలిని అనుక్షణం మైమరిపిస్తారు. ఇలాంటి వారు డబ్బు కూడా బాగానే సంపాదిస్తారని నిపుణులు చెబుతున్నారు. సమస్యలు పరిష్కరించడంలో వీరిది అందెవేసిన చేయి అని, ఇంజనీరింగ్ రంగంలో వీరు రాణిస్తారని వారు సూచిస్తున్నారు. ఇక ఉంగరం వేలు, చూపుడు వేలు రెండూ ఒకే సైజులో ఉంటే...వారికి గొడవలంటే అస్సలు పడదు. జీవితం హాయిగా గడిచిపోవాలని కోరుకుంటారని నిపుణులు చెబుతున్నారు. సాఫీగా ఉన్నారని వీరితో గొడవలు పెట్టుకుంటే మాత్రం చుక్కలు చూపిస్తారని వారు హెచ్చరిస్తున్నారు. వీరు జీవిత భాగస్వామిని బాగా చూసుకుంటారని, అలాగే ఇంటా, బయటా వ్యవహారాలు చక్కబెట్టడంలో వీరు నిపుణులని వారు తెలిపారు. ఇప్పుడు మీ చూపుడు వేలు, ఉంగరం వేలు సరి చూసుకోండి...మీరు ఏ విభాగంలోకి వస్తారో చూసుకోండి.

More Telugu News