: ఫైనల్స్ ఆడే అవకాశం తొలిసారి వచ్చింది...వదులుకోను: డివిలియర్స్

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆరేళ్లుగా ఆడుతున్నానని ఏబీ డివిలియర్స్ తెలిపాడు. ఈ ఆరేళ్ల కెరీర్ లో రాని అవకాశం ఈసారి వచ్చిందని, దానిని సద్వినియోగం చేసుకుంటానని అన్నాడు. తొలిసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నానని, తలచుకుంటేనే చాలా ఉద్వేగంగా ఉందని, ఈ ఫైనల్ మ్యాచ్ తనకు చాలా విలువైనదని ఏబీ చెప్పాడు. ఫైనల్లో ఆడే గౌరవం దక్కుతున్నప్పుడు దానిని సద్వినియోగం చేసుకుంటానని అన్నాడు. జట్టు విజయానికి తోడ్పడే ప్రతి ఇన్నింగ్స్ విలువైనదేనని డివిలియర్స్ తెలిపాడు. సెంచరీలు, హాఫ్ సెంచరీలు, గణాంకాల గురించి అస్సలు పట్టించుకోనని, అవి కేవలం అంకెలేనని, ఆట అంతకంటే గొప్పదని అన్నాడు. ఆడితే అంకెలు చేరుతూ పోతాయని పేర్కొన్నాడు. ఫైనల్ ఫలితాన్ని ఊహించలేము కానీ, జట్టులో ఆరోగ్యకరమైన వాతావరణం ఉందని తెలిపాడు. 45 బంతుల్లో 79 పరుగులు సాధించిన డివిలియర్స్ గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఒంటిచేత్తో గెలిపించిన సంగతి తెలిసిందే.

More Telugu News