: ఫ్రిజ్ లో ఆహారం తింటున్నారా?...అయితే ఒక్క నిమిషం ఆలోచించండి

ఆహార పదార్థాలు నిల్వ వుండడం కోసం వాటిని ఫ్రిజ్‌ లో పెడుతుంటాం. అయితే ఇలా ఫ్రిజ్ లో నిల్వ వుండే ఆహారం తీసుకోవడంపై ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది. ఫ్రిజ్ తెరిచిన తరువాత అందుబాటులో ఉన్న అరలో అన్నీ సర్దేస్తుంటాం...ఇది చాలా అనర్దాలకు దారితీస్తుందని ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ హెచ్చరిస్తోంది. ప్రధానంగా పాల ప్యాకెట్లను ఫ్రిజ్‌ లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని సూచిస్తోంది. వీటిని కేవలం ఫ్రిజ్‌ లోని కింద అరల్లో మాత్రమే నిల్వ ఉంచాలని సూచిస్తోంది. ఫ్రిజ్‌ లో శీతల వాతావరణం అన్ని అరల్లో ఒకే విధంగా ఉండకపోవడంతో, పాలను పై అరల్లో పెట్టడం వల్ల అక్కడ బ్యాక్టీరియా తయారవుతుందని, ఇది అనారోగ్యహేతువని ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ తెలిపింది. అలాగే ఫ్రిజ్‌ లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పదార్థాలు తినడం మంచిది కాదని కూడా హెచ్చరించింది. ఇలా నిల్వ ఉంచడం వల్ల ఆహార పదార్ధాల్లో శీతల ఉష్ణోగ్రతకు రసాయనిక చర్య జరుగుతుందని, దీని కారణంగా కేన్సర్ వచ్చే ప్రమాదముందని ఫుడ్ స్టాండర్స్ ఏజెన్సీ స్పష్టం చేసింది. అందుకే ఫ్రిజ్ లో ఏదైనా నిల్వ ఉంచేముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరిస్తోంది.

More Telugu News