: ఆడవాళ్లకు 'ఆధిపత్యం', మగవాళ్లకు 'సున్నితత్వం' కావాలట: యూఎస్ వర్శిటీ తాజా సర్వే

ఆడవాళ్లు ఎటువంటి పురుషులను ఇష్టపడతారు? ఇదే సమయంలో మగవారు ఎలాంటి స్త్రీలకు దగ్గర కావాలని భావిస్తారు? ఈ విషయంలో కాలిఫోర్నియా యూనివర్శిటీ ఓ సర్వే నిర్వహించి ఫలితాలను విడుదల చేసింది. పురుషుల్లో ఆధిపత్య ధోరణిని కనబరుస్తూ, నాయకత్వ లక్షణాలుండే వారిని స్త్రీలు తమ భాగస్వామిగా చేసుకోవాలని భావిస్తున్నారట. ఇక పురుషుల విషయానికి వస్తే, అందంతో పాటు సున్నితత్వం, తమ పట్ల విధేయతను చూపే స్త్రీలతో జీవితం గడపాలని కోరుకుంటున్నారట. 'హ్యూమన్ నేచర్' జర్నల్ లో ఈ సర్వే వివరాలు ప్రచురితం కాగా, అటు పురుషులు, ఇటు స్త్రీలు జన్యు పరంగా వచ్చే రుగ్మతలు వచ్చే అవకాశం లేనివారు తమకు కావాలని చెప్పడం గమనార్హం. ఇక నిజ జీవితంలో తమకు భాగస్వామిని ఎన్నుకోవాలంటే, వారితో డేటింగ్ కు వెళ్లి దగ్గరగా పరిశీలించడం మంచి మార్గమని కూడా సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు వెల్లడించారు. కేవలం నిమిషాల పాటు కలిసి మాట్లాడితేనే వారితో మరికొంత సమయం గడపాలా? వద్దా? అన్నది నిర్ణయించుకోవచ్చని, ఆపై నడవడిక, గుణగణాలపై అవగాహన బట్టి రెండో డేటింగ్ కు ఒప్పుకుంటున్నామని యువతులు చెప్పారని సర్వే నిర్వహించిన టీమ్ లీడర్ కరెన్ వూ వెల్లడించారు.

More Telugu News