ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

క్రిష్-3 కథ నాది.. కాపీ కొట్టారు!: రాకేశ్‌ రోషన్‌పై కేసు పెట్టిన నవలా రచయిత

Mon, May 23, 2016, 02:35 PM
Related Image తాను ర‌చించిన న‌వ‌ల 'సూఅర్దాన్‌' నుంచి క‌థ‌ను కాపీ కొట్టి బాలీవుడ్ నటుడు హృతిక్ రోష‌న్ హీరోగా న‌టించిన క్రిష్‌-3 సినిమాను తీశారంటూ ర‌చ‌యిత రూప్‌ నారాయణ్‌ సోంకార్ చేసిన ఫిర్యాదుతో బాలీవుడ్‌ నిర్మాత రాకేశ్‌ రోషన్‌పై కేసు న‌మోదైంది. త‌న న‌వ‌ల‌లో మనిషి, జంతువు శారీరక లక్షణాలతో కొత్త ప్రాణికి ప్రాణంపోస్తూ దానికి మాన్వర్ అనే పేరు పెట్టాన‌ని, ఆ క‌థే క్రిష్‌-3లో ఉపయోగించారంటూ ఆయ‌న పేర్కొన్నారు. ఎటువంటి అనుమ‌తి తీసుకోకుండా త‌న క‌థ‌ను సినిమా నిర్మాత కొట్టేశాడ‌ని ఆయ‌న ఆరోపించారు. ర‌చ‌యిత రూప్‌ నారాయణ్‌ సోంకార్ చేసిన ఫిర్యాదుతో నిర్మాత రాకేశ్‌ రోషన్‌పై కేసు న‌మోదు చేశామ‌ని ముంబ‌యి పోలీసులు తెలిపారు.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Articles (Latest)
Articles (Education)