ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కామెంట్రీ బాక్స్ లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఇషా గుహ

Sat, May 21, 2016, 06:42 PM
కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. ఐపీఎల్ సీజన్ 8 లో పార్ట్ టైమ్ కామెంటేటర్ గా వ్యవహరించిన ఇషా గుహ, సీజన్ 9లో పూర్తి స్థాయి కామెంటేటర్ గా వ్యవహరిస్తోంది. తన వ్యాఖ్యానంతో ఆకట్టుకున్న ఇషా గుహకు కామెంట్రీ సహచరులు సునీల్ గవాస్కర్, ఇయాన్ బిషప్ తదితరులు సర్ ప్రైజ్ చేశారు.

ఈ రోజు ఇషా గుహ పుట్టిన రోజును పురస్కరించుకుని కామెంట్రీ బాక్స్ లో కామెంట్రీ చెబుతుండగా ఆమె చేత కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆమెకు విషెస్ చెబుతూ దిగ్గజ ఆటగాళ్లు చిన్నపిల్లల్లా మారిపోయారు. దిగ్గజాలు ఇలా తన పుట్టిన రోజు వేడుకలు జరపడంపై ఇషా ఆనందం వ్యక్తం చేసింది. దీనిని ఎలా వ్యక్తీకరించాలో తనకు తెలియడం లేదని చెబుతూ ధన్యవాదాలు చెప్పింది.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Articles (Latest)
Articles (Education)