: ఈ దఫా చైనాపై ప్రేమ కురిపించిన డొనాల్డ్ ట్రంప్!

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఈ దఫా చైనాపై ప్రేమ కురిపించారు. నిన్నటివరకూ చైనాను ఆడిపోసుకుంటూ వచ్చిన ట్రంప్, తన వైఖరిని మార్చుకున్నానన్న సంకేతాలు పంపుతూ, చైనా మిత్రదేశమని, తాను అధ్యక్షుడినైతే, మరింత సత్సంబంధాలు పెరుగుతాయని అన్నారు. చైనీయులు అమెరికాను ఇంకా గౌరవంగా చూసేలా తన విధానం ఉంటుందని, ప్రస్తుత నేతలు సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. చైనాతో బాగుంటే, అమెరికన్లు అదనంగా 500 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసుకోవచ్చని ఆయన అన్నారు. గతంలో చైనా, భారత్ వంటి దేశాలపై విమర్శలతో విరుచుకుపడ్డ ట్రంప్, ఇప్పుడు కొంత సానుకూల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News