: ఇండియాలో 166 మంది హత్యలకు సాయం చేసిన లష్కరే తోయిబా చీఫ్ లఖ్వీ... పాక్ కోర్టు కీలక వ్యాఖ్య

ముంబైపై 2008 ఉగ్రదాడుల మాస్టర్ మైండ్, లష్కరే తోయిబా చీఫ్ జకీ-ఉర్ రెహ్మాన్ లఖ్వీపై పాక్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన 166 మంది హత్య చేయబడటానికి సాయం చేశారని పేర్కొంది. ముంబై ఉగ్రదాడుల కేసును విచారిస్తున్న లాహోర్ కోర్టు లఖ్వీ ప్రమేయాన్ని ఖరారు చేస్తూనే, భారత్ లోని సాక్షులు వచ్చి కోర్టులో సాక్ష్యమివ్వకుండా, వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయకుండా శిక్షను విధించలేమని చెప్పడం గమనార్హం. ఇండియాలో ఎన్నో ఉగ్రదాడులకు ప్రణాళికలు చేసిన లఖ్వీని గత సంవత్సరం రావల్పిండి జైలు నుంచి పాక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముంబై దాడుల కేసు విచారణ పాక్ లో నిదానంగా సాగుతోందని భారత్ వాదిస్తుండగా, కేసుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పాక్, వారిపై వ్యక్తిగత చార్జ్ షీట్ లను దాఖలు చేసి విచారిస్తోంది. ఈ కేసులో ముంబై కోర్టులో సాక్ష్యమిచ్చిన 24 మందిని పాక్ పంపాలని ఆ దేశం కోరుతుండగా, ఇండియా తిరస్కరిస్తూ వస్తోంది.

More Telugu News