: నేపాల్ లో భారత పర్వతారోహకుడు రజిబ్ మృతి

ప్రపంచంలోనే ఏడవ ఎత్తైన పర్వతమైన ధవళగిరిని విజయవంతంగా అధిరోహించిన భారత పర్వతారోహకుడు రజిబ్ భట్టాచార్య (43) తిరుగు ప్రయాణంలో మృతి చెందాడు. ఈ సంఘటన నేపాల్ లో ఈరోజు ఉదయం జరిగింది. నేపాల్ లో 8,167 మీటర్ల ఎత్తులో ఉన్న ధవళగిరి పర్వతాన్ని అధిరోహించేందుకు పశ్చిమ బెంగాల్ లోని హౌరా జిల్లాకు చెందిన రజిబ్ భట్టాచార్య తన బృందంతో కలిసి వెళ్లాడు. విజయవంతంగా పర్వతారోహణ చేసిన భట్టాచార్య తిరుగు ప్రయాణం సమయంలో మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో తాత్కాలిక అంధత్వానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన మృత్యువాత పడినట్లు సమాచారం. ఈ యాత్ర ఏర్పాటు చేసిన సెవెన్ ట్రెక్స్ సంస్థ సిబ్బంది మాట్లాడుతూ, మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో రజిబ్ మృతదేహాన్ని కిందకు తీసుకురాలేకపోతున్నామని, ప్రస్తుతం అతని మృతదేహం క్యాంప్ లోనే ఉందని చెప్పారు. కాగా, 2011లో ఎవరెస్ట్, 2013లో కాంచన్ జంగా పర్వాతాలను రజిబ్ అధిరోహించారు.

More Telugu News