: కోహ్లీ...నీకిది న్యాయమా?: ఫించ్ ప్రశ్న

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుకు ముగ్ధుడు కాని వ్యక్తి లేడంటే అతిశయోక్తికాదు. గతంలో కేవలం టెక్నిక్ ను నమ్మకున్న కోహ్లీ, 'ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతా'రన్న సామెతను నిజం చేస్తూ...గేల్, డివిలియర్స్ సాన్నిహిత్యంలో భారీ షాట్లు అవలీలగా కొట్టడం నేర్చుకున్నాడు. అద్భుతమైన టెక్నిక్ కలిగిన కోహ్లీ...గేల్, డివిలియర్స్ కు దీటుగా బంతిని బౌండరీ దాటిస్తున్నాడు. దీంతో ఈ ఐపీఎల్ లో మూడు సెంచరీలతో రికార్డులు బద్దలు కొడుతున్న కోహ్లీ ఆటతీరును ఆరోన్ ఫించ్ అభినందించాడు. అదే సమయంలో కోహ్లీని నిష్టూరమాడాడు. మరీ ఇంత సులువుగా బ్యాటింగ్ చేస్తే ఎలా? అని ప్రశ్నించాడు. కోహ్లీ బ్యాటింగ్ సరళి ఇతర బ్యాట్స్ మన్ పై ఒత్తిడి పెంచుతోందని పేర్కొన్నాడు. అంత అవలీలగా బ్యాటింగ్ చేయవద్దని కోహ్లీకి ఫించ్ సరదాగా సూచించాడు.

More Telugu News