: ఈజిప్ట్ విమానం గల్లంతు... సముద్ర జలాల్లో కూలిపోయిందా?

ఈజిప్ట్ విమానం ఒకటి గురువారం గగనతలంలో గల్లంతైంది. 69 మందితో పారిస్ నుంచి ఈజిప్టు రాజధాని కైరోకు బయల్దేరిన ఈజిప్ట్ ఎయిర్ విమానం ఎంఎస్804 రాడార్ సిగ్నల్స్ కు అందకుండా అదృశ్యం అయింది. ఈ మేరకు ఈజిప్ట్ ఎయిర్ విమానయాన సంస్థ ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించింది. 37వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తూ ఈజిప్ట్ గగనతలంలోకి ప్రవేశించిన విమానం మరికొద్ది సేపట్లో కైరోకు చేరుకుంటుందనగా ఒక్కసారిగా కనిపించకుండా పోయిందని.. అందులో 59 మంది ప్రయాణికులతోపాటు 10 మంది సిబ్బంది ఉన్నారని ఈజిప్ట్ ఎయిర్ వెల్లడించింది. కాగా, ఈ విమానం మెడిటేరియన్ సముద్ర జలాల్లో కూలిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

More Telugu News