: భారత బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడూ లేనంత నష్టాన్ని చూపిన పంజాబ్ నేషనల్ బ్యాంక్!

పెరుగుతున్న రుణ బకాయిల దెబ్బ ఎలా ఉంటుందో ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కి తెలిసొచ్చింది. భారత బ్యాంకింగ్ చరిత్రలోనే ఎన్నడూ, ఏ బ్యాంక్ కూడా నమోదు చేయనంత నష్టాన్ని పీఎన్బీ కళ్లజూసింది. మార్చి 31తో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంకు రూ. 5,367.14 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం క్యూ-4లో బ్యాంకు రూ. 306 కోట్ల లాభాల్లో ఉంది. కాగా, ఈ మూడు నెలల కాలంలో మొత్తం ఆదాయం 1.33 శాతం తగ్గి రూ. 13,276 కోట్లకు చేరిందని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. 2014-15 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే నిరర్థక ఆస్తుల మొత్తం 3 రెట్లు పెరిగి రూ. 3,834 కోట్ల నుంచి రూ. 10,485 కోట్లకు పెరిగిందని బ్యాంకు తెలిపింది. మొత్తం మీద పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ. 3,974 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

More Telugu News