ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గూగుల్ డ్రైవర్ లెస్ కార్లకు ప్రత్యేక డ్రైవర్లు

Mon, May 16, 2016, 06:56 PM
గూగుల్ సంస్థకు చెందిన డ్రైవర్ లెస్ కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రహదారులపై ప్రయోగాత్మకంగా ఈ వాహనాలను ‘గూగుల్’ నడిపిస్తోంది. అయితే, ఈ వాహనాలు రోడ్లపై ఏ విధంగా నడుస్తున్నాయి? ఇతర వాహనాలు, మనుషులు అడ్డం వచ్చినప్పుడు ఎలా తప్పించుకుంటున్నాయనే పలు విషయాలను గమనించేందుకు, అందుకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు తయారు చేసేందుకు, అవసరమైతే ఆ కార్లను మాన్యువల్ గా కూడా నడిపేందుకు ఒక ప్రత్యేక డ్రైవర్ కావాలని సదరు సంస్థ భావించింది.

ఈ నేపథ్యంలోనే ‘వెహికల్ సేఫ్టీ స్పెషలిస్టు’ పేరిట ప్రత్యేక డ్రైవర్ల నియామకం చేపట్టింది. ఈ ప్రత్యేక డ్రైవర్లు 12 నుంచి 24 నెలలు పనిచేసేలా సంస్థతో ఒప్పందం ఉంటుంది. వారంలో ఐదు రోజులు పని దినాలు ఉంటాయి. రోజుకు 6 నుంచి 8 గంటల చొప్పున పని చేయాలి. విద్యార్హతల విషయాని కొస్తే కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, నిమిషానికి కనీసం 40 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం, చక్కగా డ్రైవింగ్ చేేయగలిగి ఉండటంతో పాటు ఎలాంటి నేరచరిత్ర ఉండకూడదన్నవి సంస్థ నియమనిబంధనలుగా ఉన్నాయి.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Articles (Latest)
Articles (Education)