: ఉగ్రవాదులకు మద్దతిస్తూ మమ్మల్ని అంటారా?: ఇండియాపై పాక్ విమర్శ

ఉగ్రవాదులకు, వేర్పాటు వాదులకు మద్దతిస్తున్న ఇండియా, తమ ప్రయోజనాలకు కావాలనే అడ్డుపడుతోందని పాక్ ఆరోపించింది. బెలూచిస్తాన్ లో ఆందోళనలకు భారత్ కారణమని, యూఎస్ తో తాము కుదుర్చుకున్న ఎఫ్-16 యుద్ధ విమానాల డీల్ ను ఎలాగైనా ఆపాలని కుయుక్తులు పన్నుతోందని పాక్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ వ్యాఖ్యానించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. పాక్ లోని ఉగ్రవాదులకు, బెలూచిస్తాన్ ను విడదీయాలని చూస్తున్న వేర్పాటు వాదులకు భారత్ నిధులిచ్చి ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. అమెరికాలో పాక్ అంబాసిడర్ గా పనిచేసిన హుసేన్ హక్కానీ కృషి వల్లే ఎఫ్-16 డీల్ సాకారమైందని, అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో, ఇండియా కల్పించుకుని, సెనెటర్ రాండ్ పాల్ తో తీర్మానాన్ని ప్రవేశపెట్టించిందని ఖావాజా ఆరోపించారు. ఓ వైపు ఉగ్రవాదులకు మద్దతిస్తూ, మరోవైపు పాక్ ను ఆడిపోసుకోవడం భారత్ కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.

More Telugu News