ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రెండాకులు ఎక్కువే చదివిన డొనాల్డ్ ట్రంప్ పని మనిషి!

Fri, May 13, 2016, 10:36 AM
Related Image ప్రత్యర్థులను విమర్శించడంలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఎంతమాత్రమూ వెనుకడుగు వేయబోరన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఒకప్పటి తన యజమానిని మరోసారి మంచి చేసుకుంటే, ఆయనతో పాటు వైట్ హౌస్ లో మకాం వేయవచ్చని అనుకున్నాడో ఏమో... గతంలో ట్రంప్ వద్ద దీర్ఘకాలం పాటు పనిచేసిన ఆంటోనీ సెనెకల్ అనే అతను ఇంకో అడుగు ముందుకేశాడు. ఏకంగా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా కెన్యా నుంచి వచ్చిన ద్రోహి అని, ఆయన్ను ఉరేసి చంపేయాలని ఆరోపణలు చేస్తూ, ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టాడు.

అతని వ్యాఖ్యల తీవ్రతపై ఇప్పుడు యూఎస్ సీక్రెట్ సర్వీస్ స్వయంగా రంగంలోకి దిగింది. వీటిపై విచారణను ప్రారంభించింది. ఆంటోనీ సెనెకల్ వ్యాఖ్యలు, ఆయన ఫ్రెండ్స్ కు అక్కడి నుంచి అలా అలా పాకి అమెరికాలో వైరల్ కావడంతో, ప్రస్తుతం వాటిని తొలగించినప్పటికీ, విషయమంతా తమకు తెలిసిందని, విచారణ జరుపుతున్నామని యూఎస్ ఎస్ఎస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై ట్రంప్ ప్రతినిధి స్పందిస్తూ, ఇంత పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ప్రకటన వెలువరించారు.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Articles (Latest)
Articles (Education)