: ఇండియన్ ఇంజనీర్ కు యూఎస్ లో అరుదైన హోదా

ఓ ఇంజనీరుగా అమెరికాకు వెళ్లి, అక్కడి సిక్కుల సమస్యలను పరిష్కరించాలన్న సదుద్దేశంతో వారి హక్కులను కాపాడేలా ఓ సంస్థను ప్రారంభించిన మంజీత్ సింగ్ అనే భారత యువకుడికి అరుదైన గౌరవం లభించింది. ఒబామా పాలనలో ముఖ్యమైన సలహా కమిటీలో మంజీత్ కు స్థానం లభించింది. తనకు సలహాదారుడిగా ఆయన్ను నియమిస్తూ, ఒబామా ఉత్తర్వులు జారీ చేశారు. విదేశాలతో అమెరికా సంబంధాలను మెరుగుపరిచే దిశగా మరింతగా కృషి చేయాలని, తనకు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఒబామా సూచించారు. కాగా, యూనివర్శిటీ ఆఫ్ బాంబేలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మంజీత్, న్యూయార్క్ నుంచి మాస్టర్ సైన్స్ పట్టాను పొందారు. 2013లో యూఎస్ లో సాఫ్ట్ వేర్ సంస్థను స్వయంగా ప్రారంభించారు. గురుగోవింద్ సింగ్ ఫౌండేషన్ లో సభ్యుడిగా ఉండి ఇండియా నుంచి యూఎస్ వెళ్లే సిక్కులకు సహాయపడ్డారు. ఇప్పుడు ఆయన సేవలకు ఘనమైన గుర్తింపు లభించింది.

More Telugu News