: రూ. 20 వేలకే 32 అంగుళాల స్మార్ట్ టీవీలను విడుదల చేసిన ఇండియన్ కంపెనీ

స్మార్ట్ టీవీ... కేవలం టెలివిజన్ చానళ్లలో కార్యక్రమాలు, సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఇంటర్నెట్, వివిధ రకాల సామాజిక మాధ్యమాలు, ఈ-మార్కెటింగ్, ఆన్ లైన్ సేవలను అందించే టెలివిజన్. ప్రస్తుతం పేరున్న కంపెనీల స్మార్ట్ టీవీ కొనాలంటే రూ. 40 వేలకు పైగానే వెచ్చించాల్సి వుంటుంది. ఈ పరిస్థితుల్లో ఇండియాకు చెందిన వీయూ, వివిధ రకాల పరిమాణాల్లో స్మార్ట్ టీవీలను అందుబాటు ధరల్లో విడుదల చేసింది. నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, యుప్ టీవీ, ఫేస్ బుక్, ఆక్యూ వెదర్ వంటి యాప్స్ ముందుగానే లోడ్ చేసిన 32 అంగుళాల హెచ్డీ స్క్రీన్ టీవీని రూ. 20 వేల ధరకు విడుదల చేసింది. ఇదే సమయంలో 40 అంగుళాల టీవీని రూ. 30 వేలకు, 55 అంగుళాల టీవీని రూ. 52 వేలకు అందించనున్నట్టు తెలిపింది. వీటిని ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని సంస్థ సీఈఓ దేవితా సరాఫ్ వెల్లడించారు. వీయూ సంస్థ తన స్మార్ట్ టీవీ రేంజ్ ని ఈ సంవత్సరం జనవరిలో తొలిసారిగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News