: ఆమె నడుస్తున్న భూకంపం...భూకంపం ఎప్పుడొచ్చినా ఆమెకు క్షణాల్లో తెలిసిపోతుంది

స్పానిష్ డాన్సర్ మూన్ రిబాస్ ను ఆమె స్నేహితులంతా నడుస్తున్న భూకంపం అంటారు. డాన్సులో వైవిధ్యం చూపించాలని పరితపించే రిబాస్ తన మోచేతి ప్రాంతంలో ఓ చిప్ ను అమర్చుకుంది. ఆ చిప్ ను ఆపిల్ యాప్ కు అనుసంధానించారు. ఈ యాప్ ను ప్రపంచంలోని అన్ని జియోలాజికల్ మానిటర్స్ కు కనెక్ట్ చేశారు. ఈ మానిటర్స్ ఆయా ప్రాంతాల్లో సంభవించే భూప్రకంపనలను గుర్తించి వైబ్రేషన్స్ విడుదల చేస్తాయి. వీటిని రిబాస్ చేతిలో ఉన్న చిప్ రిసీవ్ చేసుకుని వైబ్రేట్ చేస్తుంది. దీంతో ఆమె యాప్ ఓపెన్ చేసి భూకంపం ఏ ప్రాంతంలో వచ్చింది, ఎంత తీవ్రతతో వచ్చింది? అనే అంశాలను చూసుకుంటుంది. ఈ చిప్ ఆమె అమర్చుకోవడం వెనుక ఓ కారణం ఉంది. డాన్స్ లో వైవిధ్యం కోసం ఆమె పని చేసింది. భూమిపొరల్లో ఎప్పుడూ ప్రకంపనలు సంభవిస్తుంటాయని, తద్వారా చిప్ వైబ్రేట్ అవుతుందని, తన మోచేతిలో అమర్చుకున్న చిప్ వాటిని గ్రహించి తన శరీరాన్ని వైబ్రేట్ చేయడం వల్ల డాన్స్ వైవిధ్యంగా కనిపిస్తుందని ఆమె పేర్కొంది. 2015 ఏప్రిల్ లో నేపాల్ భూకంపం వచ్చినప్పుడు ఆమె నిద్రపోతున్నారు. అయితే తన శరీరంలో వచ్చిన వైబ్రేషన్స్ కు ఆమె కదలిపోయింది. యాప్ ఉపయోగించి భూకంపం ఎక్కడవచ్చిందో ఆసక్తికొద్దీ తెలుసుకుంది. అయితే ఆ క్షణంలో తాను భూకంపం ప్రాంతంలో ఉన్న అనుభూతి చెందానని, ప్రకంపనలు అంత తీవ్రస్థాయిలో వచ్చాయని ఆమె చెప్పింది. తన లైవ్ షోలో ఉండగా భూకంపం వస్తే, ఆమె వైవిధ్యమైన నృత్య రీతులు ప్రదర్శిస్తానని అంటోంది. లైవ్ లేకపోతే డాన్స్ ప్రాక్టీస్ సమయంలో వస్తే, అప్పడు తన శరీరంలో వచ్చిన ప్రకంపనలను బట్టి నృత్య రీతులు సమకూర్చుతానని ఆమె తెలిపింది. తనను తాను సైబోర్గ్ ఆర్టిస్ట్ గా ఆమె సంభోదిస్తే, ఆమె స్నేహితులు మాత్రం నడిచే భూకంపం అని పేర్కొంటారు.

More Telugu News