: స్వలింగ వివాహాలకు ప‌చ్చ‌జెండా ఊపిన ఇటాలియ‌న్‌ పార్ల‌మెంట్

స్వ‌లింగ సంప‌ర్కులు వివాహం చేసుకొని, అంద‌రిలాగే జీవ‌నాన్ని కొన‌సాగించడానికి ఇటాలియ‌న్ పార్ల‌మెంట్‌ ఆమోదం తెలిపింది. ఇక‌పై స్వ‌లింగ సంపర్కులు స్వేచ్ఛ‌గా పెళ్లి చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. దీంతో అక్క‌డి స్వ‌లింగ సంప‌ర్కులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇటాలియ‌న్ పార్లమెంట్లో కాన్ఫిడెన్స్ ఓటు ద్వారా బిల్లుకు స‌భ్యులు ప‌చ్చ‌జెండా ఊప‌డంతో అక్క‌డి స్వ‌లింగ సంప‌ర్కులు వేడుక చేసుకుంటున్నారు. బిల్లుపై ఆ దేశ ప్ర‌ధాని మట్టెయో రెంజీ సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. స్వ‌లింగ సంప‌ర్కుల ఆశ‌లు ఫ‌లించినందుకు వారు ఎంతో సంబ‌ర‌ప‌డిపోతున్నార‌ని పేర్కొన్నారు.

More Telugu News