: వెనుక నుంచి చూస్తే చిన్నపిల్లాడు, ముందు నుంచి చూస్తే హిట్లర్ లా కన్పించే శిల్పం!

జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ శిల్పంకు అత్యధిక ధర పలికింది. ‘బౌండ్ టు ఫెయిల్’ పేరిట న్యూయార్క్ లోని క్రిస్టీన్ ఆక్షన్ హౌస్ వేలం పాట కార్యక్రమాన్ని నిన్న నిర్వహించింది. మోకాళ్లపై కూర్చుని ప్రార్థన చేస్తున్నట్టు ఉండే హిట్లర్ శిల్పం 17.2 మిలియన్ డాలర్లు పలికింది. ఈ శిల్పంకు ఇంత ధర పలుకుతుందని తాము అనుకోలేదని, 10 నుంచి 15 మిలియన్ డాలర్లు పలుకుతుందని తాము అనుకున్నామని ఆక్షన్ నిర్వాహకులు పేర్కొన్నారు. మౌరిజో కాటెలన్ అనే శిల్పకారుడు తయారు చేసిన ఈ శిల్పం ప్రత్యేకత ఏమిటంటే, వెనుక నుంచి చూస్తే పిల్లాడిలాగా, ముందునుంచే చూస్తే హిట్లర్ లాగా కనపడుతుంది. 2001లో ఈ శిల్పాన్ని తయారు చేశారు. గతంలో ఇదే ఆక్షన్ హౌస్ నిర్వహించిన వేలంలో కాటెలన్ రూపొందించిన శిల్పంకే అత్యధికంగా 7.9 మిలియన్ డాలర్లు వచ్చాయి. మళ్లీ ఈ శిల్పకారుడు రూపొందించిన శిల్పానికే అధిక ధర పలకడంతో కాటెలన్ తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.

More Telugu News