: అత్యధికులు వాడుతున్న 25 'చెత్త పాస్ వర్డ్' లివే!

గతవారంలో ప్రపంచ 'పాస్ వర్డ్ దినోత్సవం' జరుపుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇంటర్నెట్ విస్తరణ కుగ్రామాలకు సైతం విస్తరిస్తున్న వేళ, మరింత మెరుగైన, ఇతరుల చేతికి చిక్కని విధంగా పాస్ వర్డ్ ల వాడకంపై నెటిజన్లలో అవగాహన పెంచేందుకు ఈ దినాన్ని వాడుకోవాలన్న ఆలోచన రావడం శుభపరిణామమే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు వాడుతున్న 'చెత్త పాస్ వర్డ్'ల జాబితాను స్ప్లాష్ డేటా విడుదల చేసింది. 2015లో మొత్తం 20 లక్షల పాస్ వర్డ్ లు లీకయ్యాయని చెబుతూ, వాటిల్లో అత్యధికులు వాడిన పాస్ వర్డ్ జాబితాను ప్రకటించింది. అత్యంత చెత్త పాస్ వర్డ్ గా, అందరూ సులువుగా తెలుసుకునేలా ఉన్నదేంటో తెలుసా? అది '123456'. చెత్తలో చెత్త పాస్ వర్డ్ ఇదేనట. ఆపై 'password', '12345678', 'qwerty', '12345'లు టాప్ 5 జాబితాలో నిలిచాయి. వీటి తరువాత 123456789, football, 1234, 1234567, baseball, welcome, 1234567890, abc123, 111111, 1qaz2wsx, dragon, master, monkey, letmein, login, princess, qwertyuiop, solo, passw0rd, starwars నిలిచాయి. షాపింగ్, బ్యాంకింగ్, సామాజిక మాధ్యమాల వాడకం విస్తృతమైన నేపథ్యంలో, కేవలం ఎవరికి వారు మాత్రమే గుర్తుంచుకునేలా, పాస్ వర్డ్ ను ఎంచుకోవాలని స్ప్లాష్ డేటా సలహా ఇస్తోంది.

More Telugu News