ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇళయరాజాతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది: కమలహాసన్

Sun, May 08, 2016, 05:18 PM
Related Image ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంటుందని ప్రముఖ నటుడు కమలహాసన్ అన్నారు. కమల్ తాజా త్రిభాషా చిత్రం ‘శభాష్ నాయుడు’కు ఇళయా రాజా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కమల్ ఒక ట్వీట్ చేశారు. ఇళయరాజాతో కలిసి పనిచేయడం భలే సరదాగా ఉంటుందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో కమల్ సరసన రమ్యకృష్ణ నటించనున్నారు. కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మలయాళ దర్శకుడు రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘శభాష్ నాయుడు’ని తెలుగు, తమిళం, హిందీ భాషలలో తెరకెక్కించనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Articles (Latest)
Articles (Education)