: ఈ దంపతులు గొప్ప పని చేశారు... ఏడాది వాడినా కంపుకొట్టని సాక్స్ తయారు చేశారు!

స్కూలు, కాలేజీ, ఆఫీస్, పార్టీ, ఫంక్షన్ ఇలా ఎక్కడికెళ్లినా నీట్ గా తయారై వెళ్లడం సర్వసాధారణం. అందులో భాగంగా కాళ్లకు షూస్ ధరిస్తాం. షూస్ అంటే ముందుగా సాక్సులు ధరించాలి. అయితే, ఈ సాక్సుల దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా సరే ముఖం చిట్లించాల్సిందే. ఎందుకంటే, మర్నాటికి వాటిని మార్చకపోతే కంపు కొట్టేస్తాయి. ఇప్పుడీ సమస్యకు ఓ దంపతులు చక్కని పరిష్కారం చూపించారు. ఏడాది పాటు వేసుకున్నా దుర్గంధం రాని సాక్సులను తయారు చేశారు. ఇంగ్లండ్ లోని ఈస్ట్ డెవోన్ లో నివసించే స్టీవ్, జెన్నీ దంపతులకు ఓ గోట్ ఫాం ఉంది. ఇందులో వందలాది అంగోరా జాతి మేకలు ఉన్నాయి. ఇతర మేకలతో పోల్చుకుంటే వీటికి బొచ్చు బాగా పెరుగుతుంది. రకరకాల ప్రయోగాల అనంతరం ఈ మేకల నుంచి సేకరించిన ఉన్నికి వాసనను నిరోధించే గుణం ఉన్నట్టు ఈ దంపతులు గుర్తించారు. వీటితో సాక్సులు తయారు చేసి చుట్టుపక్కల వారికి అందజేశారు. అవి ధరించిన వారంతా ఆశ్చర్యపోయారు. వరుసగా వాటిని ఏడు నెలల పాటు వాడినా కూడా ఆ సాక్సుల నుంచి ఎలాంటి దుర్గంధం రాలేదని కొందరంటే, ఏడాది వాడినా కంపు కొట్టలేదని మరికొందరు తెలిపారు. ఇప్పుడీ సాక్సులకు మంచి డిమాండ్ పెరుగుతోంది.

More Telugu News