: ‘టన్నెల్ ఆఫ్ లవ్’కు సందర్శకుల తాకిడి

ఉక్రెయిన్ లోని క్లెవాన్ సమీపంలో ఉన్న ‘టన్నెల్ ఆఫ్ లవ్’కు వెళితే అక్కడి నుంచి కదలబుద్ధి కాదు. ముఖ్యంగా ప్రేమికులకు అయితే, ఇది సరైన ప్లేస్. ఎందుకంటే, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చదనం.. కావలసినంత ఏకాంతం వుంటాయి. ఇంతకీ, ‘టన్నెల్ ఆఫ్ లవ్’ అంటే ఏమనుకుంటున్నారు. అదేదో పార్కో లేక ఉద్యానవనమో అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే, ‘టన్నెల్ ఆఫ్ లవ్’ అనేది ఒక రైల్వే ట్రాక్. సుమారు 3 కిలోమీటర్ల మేర ఉండే ఈ సొరంగం రైల్వేట్రాక్ ఇప్పటి కాదు. సైనిక సామగ్రిని రహస్యంగా తరలించుకునేందుకు దశాబ్దాల క్రితం ఈ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. అందుకే, ఆ ట్రాక్ చుట్టూ మొక్కలు పెంచారని సమాచారం. అయితే, ఈ ట్రాక్ కు సమీపంలో ఉన్న ఒక ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం ట్రాక్ కు అడ్డంగా ఉన్న చెట్లను ఎప్పటికప్పుడు చక్కగా కత్తిరించి అందంగా ఉండేలా చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీకి వచ్చే ఫ్లైవుడ్ సామగ్రి రైలు ద్వారానే ఇక్కడికి వస్తుంటుంది. అయితే, ఈ అందమైన ట్రాక్ ను సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గుతోందని, తద్వారా తమకు వచ్చే సరుకు ఆలస్యంగా చేరుతోందని ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోంది.

More Telugu News